భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ కనిపించడం లేదంటూ హర్యానాలోని జులానా నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గంలో వినేష్ కనిపించడం లేదంటూ రాతలు రాశారు. ఎవరికైనా కనిపిస్తే స్థానికులకు తెలియజేయాలని పోస్టర్లలో పేర్కొన్నారు. వినేష్ ఫోగట్.. స్థానికంగా జరుగుతున్న సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో ఆమె కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి తొలిసారి వినేష్ ఫోగట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ కెప్టెన్ యోగేష్ బైరాగిపై 6,000 ఓట్లతో వినేష్ ఫోగట్ విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: SCSS Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల రూ. 20,500
ప్యారిస్ ఒలంపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్‌లో వినేష్ ఫోగట్ అర్హత కోల్పోయింది. బరువు ఎక్కువగా ఉన్నందున ఆమె నిష్క్రమణకు గురైంది. దీంతో ఆమె నిరాశ చెందింది. రెజ్లర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆమె హర్యానా ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం జులానా నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. అనూహ్యంగా ఆమె విజయం సాధించారు. ఇటీవల ఆమె మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించారు.
ఇది కూడా చదవండి: RBI Action On Banks: కొరడా ఝుళిపించిన ఆర్బిఐ.. ఆ ఐదు బ్యాంకులకు భారీగా జరిమానా