Site icon NTV Telugu

Udit Raj: ఆర్ఎస్ఎస్ ఉగ్ర సంస్థ.. మోడీ ఆధునిక రావణుడు.. కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు

Uditraj

Uditraj

ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు. ఇక ప్రధాని మోడీ ఆధునిక రావణుడికి చిహ్నం అని తెలిపారు. ప్రధాని మోడీ ఎక్కువ కాలం కొనసాగలేరని.. త్వరలోనే ఆయన లంకలో అగ్నిప్రమాదం జరుగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో దారుణం.. 12 ఏళ్ల కుమార్తెను చంపి తల్లి ఏం చేసిందంటే..!

ఆర్ఎస్ఎస్ భావజాలమే మహాత్మా గాంధీ హత్యకు కారణమైందని ఆరోపించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపితను మనమంతా గౌరవించే రోజు అని తెలిపారు. కానీ ఆయన పుట్టినరోజున ఒక హంతకుల సంస్థ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Bomb Threats: చంద్రబాబు, జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపులు..

తాలిబన్ మంత్రికి భారత్ ఆతిథ్యం ఇవ్వడమేంటి? భవిష్యత్‌లో ఇది విదేశీ సంబంధాలకు ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. చైనా విషయంలో.. అమెరికా విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే.. మోడీ ఏదో విజయం సాధిస్తున్నట్లుగా వాళ్లంతా ప్రచారం చేస్తారన్నారు. వాస్తవానికి అదంతా విరుద్ధం అన్నారు. మంచి సంబంధాలు ఉన్నట్లుగా భ్రమపరుస్తారని.. కానీ అదంతా పూర్తిగా వ్యతిరేకం అన్నారు. ఆప్ఘనిస్థాన్ మన పొరుగుదేశమే కాదనడం లేదు.. కానీ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పుకొచ్చారు.

ఉదిత్ రాజ్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. మరోసారి కాంగ్రెస్ హద్దు దాటిందని బీజేపీ నేత షెహజాద్ పూనవల్లా అన్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి భారతదేశాన్ని దూషించడం.. మోడీకి వ్యతిరేకంగా చెడుగా మాట్లాడడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఆరోగ్యం బాగోలేకపోతే మోడీ ఫోన్ చేసి పరామర్శించాారు. అలాంటి వ్యక్తిని రావణుడితో పోల్చడం ఏంటి? అని ప్రశ్నించారు. మొన్న తల్లిని.. ఇప్పుడు మోడీని విమర్శించారని మండిపడ్డారు.

ఉదిత్ రాజ్.. మాజీ లోక్‌సభ ఎంపీ. 2014-2019 వరకు బీజేపీ నుంచి వాయువ్య ఢిల్లీ నుంచి ఎంపీగా పని చేశారు. అనంతరం బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు. ఇక అంతకముందు న్యూఢిల్లీలో మాజీ డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను అదనపు కమిషనర్‌గా పనిచేశారు.

Exit mobile version