దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇవాళ యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో పోలింగ్ జరగనుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఓటమి కి కాంగ్రెస్ పార్టీ యే ప్రధాన కారణం అవుతుందన్నారు. యోగి-మోడీ వటవృక్షాన్ని యూపీలో కదిలించింది ప్రియాంక గాంధీ. బీజేపీ వటవృక్షం పడిపోక తప్పదన్నారు హరీష్ రావత్.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలను హరీష్ రావత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉత్తరాఖండ్ కు తాను కాపలాదారుడినని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్. ఉత్తరాఖండ్ కు కాపలా కుక్కలా ఉంటానన్న మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ విజయం తమదేనని ధీమాతో వున్నారు. అవసరమైతే కరుస్తాను కూడా అని వ్యాఖ్యానించారు మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్. హరీష్ రావత్ నుద్దేశించి అమిత్ షా చేసిన ఘాటైన వ్యాఖ్యలకు ధీటుగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి. ఈ ఎన్నికలు ఉత్తరాఖండ్ ప్రజలకు, బీజేపీకి మధ్య జరిగే ఎన్నికలుగా ఆయన పేర్కొన్నారు.
