ఇండియా కూటమిలో కాంగ్రెస్ తన పాత్రను పోషించడంలో విఫలమైందని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. కూటమిలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీలు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చాయి. మంగళవారం శరద్ పవార్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే ఏర్పాటైందని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు సహకరించాలని తమ భావన అంటూ చెప్పారు. మంగళవారం సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఇండియా కూటమి పని చేయాలన్నారు. దురదృష్టవశాత్తూ.. కూటమి లక్ష్యాలను అర్థం చేసుకోవల్సిన కాంగ్రెస్.. తన పాత్రను అర్థం చేసుకోవడంలో విఫలమైందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: దాయాది దేశాల మధ్య సయోధ్య! కాల్పులకు ముగింపు పడే సూచన
ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తాయి. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కూటమిలో ఉన్న నేతలు స్వరం విప్పుతున్నారు. ఇండియా కూటమి ఉన్నది కేవలంలో లోక్‌సభ ఎన్నికల కోసమేనని చెబుతున్నారు. దీంతో స్థానికంగా రాష్ట్రాల్లో జరిగే లోకల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి.
ఇక ఢిల్లీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఇక్కడ ఆప్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా… అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తోంది. ఈసారి అధికారం ఏ పార్టీకి కట్టబెడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: Immunity Boosting Asanas: ఇమ్యూనిటీని పెంచే యోగాసనాలు.. రోజూ సాధన చేస్తే ఆరోగ్యం పదిలం!