Site icon NTV Telugu

Sonia Gandhi: రేపు ఈడీ విచారణకు సోనియా గాంధీ.. నిరసనలకు కాంగ్రెస్ సిద్ధం

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 21న సోనియాను దాదాపు 2 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు రేపు మరోసారి ప్రశ్నించనున్నారు. తిరిగి ఈ నెల 26న మ‌రోమారు విచార‌ణ‌కు రావాల‌ని నాడే స‌మ‌న్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అక్రమ నగదు చలామణికి పాల్పడిన అభియోగంపై ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద ఆమె వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

మంగ‌ళ‌వారం మ‌రోమారు ఈడీ విచార‌ణ‌కు సోనియా గాంధీ హాజ‌రు కానున్న నేప‌థ్యంలో సోమ‌వారం కాంగ్రెస్ పార్టీ ఓ కీల‌క స‌మావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం సాయంత్రం జ‌రిగిన ఈ భేటీకి పార్టీ ప్రధాన కార్యద‌ర్శులు, ఆయా రాష్ట్రాల శాఖ‌లు, విభాగాల ఇంఛార్జీలు, ఎంపీలు హాజర‌య్యారు. ఈ భేటికి నేతృత్వం వ‌హించిన పార్టీ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే… అహింసా ప‌ద్ధతుల్లోనే బీజేపీ స‌ర్కారుకు నిర‌స‌న తెలియ‌జేయాల‌ని సూచించారు. ఈ చర్య రాజకీయ ప్రతికారమేనని కాంగ్రెస్‌ నాయకత్వం ఆరోపిస్తోంది. సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అగ్రనేతలంతా దీని నిమిత్తం మంగళవారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి చేరుకోనున్నారు.

108 Staff Sincerity: నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది

వాస్తవానికి సోనియా గాంధీ గత నెలలోనే హాజరుకావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా హాజరుకాలేకపోయారు. ఇదే కేసులో ఆమె తనయుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ దాదాపు 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.

Exit mobile version