Site icon NTV Telugu

Congress: ‘‘ప్రధాని మోడీ బలహీనుడు’’.. ట్రంప్ H-1B వీసాలపై కాంగ్రెస్ విమర్శలు..

Rahulgandhi

Rahulgandhi

Congress:`నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇచ్చే H-1B వీసాలపై అమెరికా 100,000 డాలర్ల (రూ. 88 లక్షలకు పైగా) వార్షిక రుసుమును విధించింది. ట్రంప్ తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల భారతీయులపై చాలా ప్రభావం పడుతోంది. 70 శాతం హెచ్1బీ వీసా హోల్డర్లు భారతీయులే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే, ఈ నిర్ణయం తర్వాత, ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది.

Read Also: Viral Wedding: పోయే కాలంలో పెళ్లేంది సామి.. ! 72 ఏళ్ల వరుడితో.. 27 ఏళ్ల వధువుకు వివాహం

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ భారతదేశానికి బలహీనమైన ప్రధాని ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే మోడీ విదేశాంగ విధానాన్ని తప్పుపట్టారు. కౌగిలింతలు, నినాదాలు భారత జాతీయ ప్రయోజనాలనున పరిరక్షించవని అన్నారు.

‘‘నేను మరోసారి చెబుతున్నా, భారతదేశం బలహీనమైన ప్రధానిని కలిగి ఉంది’’ అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యూఎస్ పర్యటన సమయంలో ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య H-1B వీసా ఆందోళనలు చర్చనీయాంశం కానప్పుడు 2017 నుండి తాను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు షేర్ చేశారు. ‘‘విదేశాంగ విధానం మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం, భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచడం, జ్ఞానం, సమతుల్యతతో స్నేహాలను నడిపించడం’’ అని ఖర్గే ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని అన్నారు.

Exit mobile version