Kamal Nath: మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఆ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ ఇప్పటికే ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 116 స్థానాలను దాటింది. అక్కడ 150కి పైగా స్థానాల్లో బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ఆధిక్యత కనబరుస్తోంది.
Read Also: Barrelakka: బర్రెలక్కకు పోల్ అయిన ఓట్లు ఎన్నో తెలుసా?
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం అభ్యర్థిగా చెప్పబడుతున్న కమల్ నాథ్‌కి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఓ వైపు కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆయనకు విషెస్ తెలుపుతూ, పోస్టర్లు కనబడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన ఎన్నికల రేసులో వెనకంజలో ఉన్నారు. కాంగ్రెస్ కంచుకోటగా, కమల్ నాథ్ స్వస్థానం అయిన చింద్వారా నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 1998 నుంచి చింద్వారా ఎంపీ స్థానంలో కమల్ నాథ్ గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి అసెంబ్లీ స్థానంలో ఓడిపోవచ్చని తెలుస్తోంది. అయితే తాను ఎలాంటి ట్రెండ్స్ చూడటం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.