ఒడిశాలోని జాజ్‌పూర్‌లో కీటకాల గుంపు వాహనదారులను, ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద ఎత్తున కీటకాల దండు తరలిరావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్లల్లో పడడంతో బైకర్లు బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయారు. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మనం అప్పుడప్పుడు మిడతల దండు, కోతుల దండు పేర్లు వింటుంటాం. కానీ ఈసారి కీటకాల దండు ఒడిశాను కకావికలం చేస్తోంది. జాజ్‌పూర్ వంతెనపై కీటకాల గుంపు కప్పేశాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: US: టెక్సాస్‌లో కాల్పులు.. ముగ్గురు సహోద్యోగుల్ని కాల్చి చంపి నిందితుడు ఆత్మహత్య
గత కొద్ది రోజులుగా కీటకాల బెడద కొనసాగుతోంది. ఇది క్రమక్రమంగా పెరిగి మరింత ఇబ్బందికరంగా మారింది. కొన్ని రోజులుగా వంతెనపై రాకపోకలు జరిగిస్తున్న వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. కళ్లల్లోకి వెళ్లడంతో సురక్షితంగా రాకపోకలు సాగించలేకపోతున్నారు. పట్టు కోల్పోయి కిందపడి పోతున్నారు.
ఇది కూడా చదవండి: Trump-BBC: ట్రంప్ ప్రసంగం ఎడిట్‌పై ఇక్కట్లు.. బీబీసీ డైరెక్టర్, సీఈవో రాజీనామా
రాత్రిపూట పెద్ద సంఖ్యలో కీటకాలు వంతెనను కప్పేస్తున్నాయని.. ప్రతి శీతాకాలంలో ఇలానే జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. నదీ తీరాల వెంబడి.. సమీప అడవుల్లో గూడు కట్టుకునే కీటకాలు.. లైటింగ్ వెలుగుకి ఆకర్షింపబడి వచ్చేస్తున్నాయని చెబుతున్నారు. ఉష్ణోగ్రత తగ్గినప్పుడల్లా ఇలా బయటకు వస్తుంటాయని పేర్కొన్నారు. వాహనాల చుట్టూ చేరి పెద్ద శబ్దం చేస్తుంటాయని.. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
