దక్షిణ అమెరికాలోని కొలంబియాలో విమానం కూలిపోయింది. 15 మందితో కుకుటా నుంచి ఒకానాకు వెళ్తున్న వాణిజ్య బీచ్‌క్రాఫ్ట్-1900 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పార్లమెంట్ సభ్కుడు సహా 15 మంది మృతి చెందారు.
బుధవారం ఉదయం 13 మంది ప్రయాణికులు.. ఇద్దరు సిబ్బందితో విమానం కుకుటా నుంచి ఒకానాకు బయల్దేరింది. అయితే ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందే కాటాటుంబోలో అదృశ్యమైంది. సెర్చ్ ఆపరేషన్ తర్వాత విమాన శిథిలాలు కనిపించాయి. కొలంబియా-వెనిజులా సరిహద్దు సమీపంలో కనిపించింది. ఈ ఘటనలో కొలంబియన్ పార్లమెంట్ సభ్యుడితో పాటు అందరూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కొలంబియన్ ఏరోస్పేస్ ఫోర్స్, సివిల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. మృతుల వివరాల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
