Site icon NTV Telugu

Bengaluru: ఒడిశా తరహాలో బెంగళూరులో మరో ఘోరం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం

Bengalurucollegestudent

Bengalurucollegestudent

ఒడిశాలో జరిగిన ఘోర సంఘటనను మరువక ముందే కర్ణాటకలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, బ్లాక్ మెయిల్ చేశారని కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: Srinivasaa Chitturi: టాలీవుడ్ నిర్మాత ఇంట విషాదం

కర్ణాటకలోని మూడబిద్రిలోని కళాశాల విద్యార్థినిని భౌతికశాస్త్రం బోధించే నరేంద్ర పరిచయం చేసుకున్నాడు. చదువులో సహాయం చేస్తానని.. నోట్స్ బుక్స్ ఇస్తానని పరిచయం చేసుకున్నాడు. అది స్నేహంగా మారింది. దీంతో నరేంద్ర తన స్నేహితుడైన అనూప్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను బెదిరించి అనూప్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ వీడియోలను అడ్డంపెట్టుకుని జీవశాస్త్రం బోధించే సందీప్ కూడా అత్యాచారం చేశాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ మధ్య వీడియోలను అడ్డంపెట్టుకుని అనూప్.. నిత్యం లైంగిక కోరిక తీర్చాలంటూ వేధిస్తు్న్నాడు. లేదంటే ఆన్‌లైన్లో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. ఇక ఈ బాధను తట్టుకోలేక.. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పేసింది. దీంతో వారంతా మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో మారతహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: War 2: సినిమా అంతా ఎన్టీఆర్ ఉంటాడు!

ఇదిలా ఉంటే.. లెక్చరర్‌ వేధింపులు భరించలేక గతవారం కాలేజీ ప్రాంగణంలోనే ఒడిశా విద్యార్థిని(20) ఒంటికి నిప్పంటించుకుంది. కాలేజ్ ప్రొఫెసర్ నుంచి నిత్యం లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది. ఇక ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి ప్రాణాలు విడిచింది. శరీరం తీవ్రంగా కాలిపోయిందని, ఆమెను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, వైద్య బృందం అన్ని రకాల మద్దతు అందించినప్పటికీ బాధితురాలిని ప్రాణాలతో కాపాడలేకపోయామని అన్నారు. ఈ కేసులో దోషులందరికి శిక్ష పడుతుందని, దీనిపై తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు జారీ చేశానని చెప్పారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు.

Exit mobile version