Site icon NTV Telugu

Coldrif Syrup: కోల్డ్‌రిఫ్ సిరప్‌తో 11 మంది చిన్నారులు మృతి.. డాక్టర్ అరెస్ట్..

Coldrif Syrup

Coldrif Syrup

Coldrif Syrup: మధ్యప్రదేశ్‌లో చింద్వారాలో కోల్డ్‌రిఫ్ సిరప్ కారణంగా 11 మంది చిన్నారులు మరణించిన సంఘటన సంచలనంగా మారింది. చిన్నారులకు ఈ సిరప్‌ని రాసిన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు. చనిపోయిన చిన్నారుల్లో ఎక్కువ మంది పరాసియాలో శిశువైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్ సోని క్లీనిక్‌లో చికిత్స తీసుకున్నారు.

ఈ సిరప్‌ను తయారు చేస్తున్న తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని కోల్డ్‌రిఫ్ తయారీ సంస్థ శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ప్రభుత్వం గతంలో కోల్డ్రిఫ్ అమ్మకాలను నిషేధించింది, ఈ ఔషధ నమూనాలలో 48.6% డైథిలిన్ గ్లైకాల్, ఇది అత్యంత విషపూరితమైన పదార్థం అని అధికారులు పేర్కొన్నారు. చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ లాబోరేటరీ పరీక్షల తర్వాత, తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ “ప్రామాణిక నాణ్యత లేనిది” అని ప్రకటించింది.

Read Also: Madurai Meenakshi Amman Temple: మధురై మీనాక్షి ఆలయంకు బాంబు బెదిరింపు

ఇదిలా ఉంటే, చిన్నారుల మరణాల నేపథ్యంలో సోమవారం కోల్డ్‌రిఫ్, నెక్ట్రో డీఎస్ అమ్మకాలను నిషేధించింది. కోల్డ్‌రిఫ్ నాణ్యతపై రిపోర్టు శనివారం రాగా, నెక్ట్రో డీఎస్ నివేదిక కోసం వేచి చూస్తున్నారు. చిన్నారులు తల్లిదండ్రుల ప్రకారం, జలుబు, తేలికపాటి జ్వరంతో బాధపడుతున్న చిన్నారులకు డాక్టర్ ఈ సిరప్‌ని సూచించారని, ముందుగా వ్యాధి లక్షణాలు తగ్గినప్పటికీ, కొన్ని రోజులకే పరిస్థితి సీరియస్‌గా మారిందని, చిన్నారుల మూత్ర విసర్జనలో అకాస్మత్తుగా, ఆందోళనకరమైన తగ్గుదల కనిపించిందని, వారి పరిస్థితి దిగజారి కిడ్నీ ఇన్ఫెక్షన్ల గురై మరణించిట్లు చెప్పారు. కిడ్నీ బయాప్సీ పరీక్షల్లో డైథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలింది.

మరణించిన చిన్నారుల్లో 11 మంది పరాసియాకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు చింద్వారాకు చెందిన వారు, ఒకరు చౌరాయ్ కు చెందిన వారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ మరణాలపై కఠిన చర్యలకు ఆదేశించారు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా ఈ సిరప్‌లను నిషేధించారు. మధ్యప్రదేశ్‌తో పాటు కోల్డ్ రిఫ్ కారణంగా రాజస్థాన్, తమిళనాడు, కేరళలో ముగ్గురు చనిపోవడంతో, ఆ రాష్ట్రాల్లో కూడా దీనిని నిషేధించారు.

Exit mobile version