Site icon NTV Telugu

Coins Missing From An SBI: ఎస్‌బీఐ నుంచి కోట్ల విలువైన నాణేలు మిస్సింగ్.. సీబీఐ సోదాలు

Coins Missing Case

Coins Missing Case

Coins Missing From An SBI, CBI Searches: సొంతింటికే కన్నాలు వేశారు అధికారులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బిఐ) నుంచి రూ. 11 కోట్ల విలువైన నాణేలు మాయం అయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్ కరౌలీ ఎస్‌బిఐ బ్రాంచ్ లో 2021లో జరిగింది. అయితే ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాాల మేరకు ఈ మిస్సింగ్ కేసులో ఏప్రిల్ 13న సీబీఐ కేసు నమోదు చేసింది.

ఈ నాణేల మిస్సింగ్ కేసులో బ్యాంకు అధికారుల ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. దీంతో గురువారం రాజస్థాన్ లోని పలు చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలి, సవాయ్ మాధోపూర్, అల్వార్, ఉదయపూర్, భిల్వారాలోని 25 ప్రాంతాల్లో 15 మంది మాజీ బ్యాంకు అధికారులు ఇళ్లలో వారికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

Read Also: Whatsapp screenshot block Option Soon: త్వరలో స్క్రీన్ షాట్ బ్లాక్.. యూజర్లకు రిలీఫ్

2021, ఆగస్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెహందీపూర్ బాలాజీ బ్రాంచ్ లో నగదు నిల్వల్లో భారీగా తేడాలు వచ్చాయి. ఏకంగా రూ.11 విలువైన నాణేలు కనిపించకుండా పోయాయి. కాయిన్ కౌంటింగ్ ను ఓ ప్రైవేట్ వెండర్కు అప్పగించారు.. అయితే కౌంటింగ్ చేపడుతున్న సమయంలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మిస్సయ్యాయని తేలింది. కేవలం రూ. 2 కోట్ల విలువైన 3000 నాణేల సంచులు మాత్రమే ఆ సమయంలో లెక్కలోకి వచ్చాయి. ఈ రూ.2 కోట్ల నాణేలను ఎస్‌బీఐ కాయిన్ హోల్డింగ్ బ్రాంచ్ కు తరలించారు. ఆ సమయంలో బ్యాంకులో విధులు నిర్వహించిన అధికారుల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. ఈ కేసుపై ఏసీబీ జైపూర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Exit mobile version