Site icon NTV Telugu

Snake Video: దగ్గు సిరప్ బాటిల్ మింగిన నాగుపాము.. చివరికి ఏమైందంటే..!

Ss

Ss

ఓ నాగుపాము ఇంటి పెరటిలోకి వచ్చి హల్‌చల్ చేసింది. ఇంటి ఆవరణలో కలియ తిరుగుతుండగా ఓ పెద్ద దగ్గు సిరప్ బాటిల్ కనిపించింది. దాన్ని ఏమనుకుందో.. ఏమో తెలియదు గానీ అమాంతంగా మింగేసింది. అది కాస్త లోపలికి వెళ్లక.. బయటకు రాక స్నేక్ విలవిలలాడింది. పాము పడుతున్న ఇబ్బందులను చూసి స్థానికులు స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇచ్చారు. పాములు పట్టే వాలంటీర్లు వచ్చి చాకచక్యంగా.. చాలా రిస్క్ చేసి బాటిల్‌ను నోట్లో నుంచి నెమ్మది నెమ్మదిగా విడిచిపెట్టేలా చేశారు. దవడను సున్నితంగా నొక్కుతూ.. బాటిల్ బయటకు వచ్చేలా ప్రయత్నం చేశారు. అలా కొద్దిసేపటికి సిరప్ బాటిల్‌ను విడిచిపెట్టింది. అంతే బ్రతుకుజీవుడా అంటూ అక్కడ నుంచి నాగుపాము జారుకుంది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Best Laptops To Buy : ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారా.. వీటిపై ఓ లుక్ వేయండి..

అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్‌సీ అధికారి నందా తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కోబ్రా దగ్గు సిరప్ బాటిల్ మింగిన తర్వాత.. తన ప్రాణాన్ని ఎలా కాపాడారో అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: AP DSC, TET 2024: టెట్, డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిపరేషన్ కు సమయం

Exit mobile version