CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
- CNGలో CBG మిశ్రమానికి కేంద్రం ప్రణాళిక సిద్ధం..?
- 2026-27లో CNGలో 3% CBG కలపాలని లక్ష్యం..
- 2028-29 నాటికి CBG మిశ్రమం 5%కి చేరాలని టార్గెట్..
- గోబర్ధన్ పథకానికి కేంద్రం ₹23,731 కోట్లు కేటాయించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CNG Biogas Blending: దేశంలో CNG వాహనాలకు సంబంధించి కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG)ను కలిపే విధానాన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తన అధికారిక వీడియోలో వివరించింది. దీంతో CNGలో బయోగ్యాస్ మిశ్రమం కలపడంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పెట్రోల్ లో 20 శాతం ఇథనాలు కలుపుతున్నారు. ఈ E20 పెట్రోల్‌పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి.
కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) అంటే ఏమిటి..?
కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) సాధారణంగా భూగర్భం నుంచి వచ్చే గ్యాస్ కాదు.ఇది జంతువుల పేడ, ఆహార వ్యర్థాలు, పంట అవశేషాల వంటి సేంద్రియ పదార్థాలు కుళ్లిపోతున్నప్పుడు తయారయ్యే గ్యాస్. దీనిని శుద్ధి చేసి CBGగా మారుస్తారు.
Also Read
- Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
- CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
రూ. 23,731 కోట్ల గోబర్ధన్ పథకం..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రిసోర్సెస్ ధన్(గోబర్ధన్ )(GOBARdhan)కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కింద CBG ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 23,731 కోట్ల కేటాయించారు. ఈ స్కీమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమై 2036 వరకు కొనసాగుతుంది. దశల వారిగా బయోగ్యాస్‌ను CNGలో కలుపనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ కలయిక లక్ష్యం 3 శాతంగా ఉంది. దీని తర్వాత, 2027-28 ఆర్థిక సంవత్సరంలో బయో-CNG వాటాను 4 శాతానికి పెంచుతారు. ఈ వాటా 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 5 శాతానికి చేరుకుంటుంది, అంటే ప్రతి సంవత్సరం సుమారుగా 1 శాతం పెరుగుదల ఉంటుంది.
CBG, CNG మైలేజీని తగ్గిస్తుందా?
BPCL వీడియో పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది యూజర్లు ఈ గ్యాస్ మిశ్రమంపై ప్రశ్నలు లేవనెత్తారు. E20 పెట్రోల్ లాగానే, CBG వాడకం కూడా వాహన మైలేజీని తగ్గించవచ్చని కొందరు భావిస్తున్నారు. నిజానికి CBG, CNG రెండింటిలోనూ ప్రధానంగా మీథేన్ వాయువు ఉంటుంది. ఇండియన్ ఆయిల్ నివేదిక ప్రకారం, CBG యొక్క కెలోరిఫిక్ విలువ CNG (సుమారుగా 52,000 kJ/kg)కి సమానంగా ఉంటుంది. అందువల్ల, దీనిని వాహన ఇంధనంగా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ రెండింటిని కలిపినా పెద్ద తేడా ఏం ఉండదు. వాహనాల మైలేజ్‌లో మార్పు రాదు.
CBG के साथ CNG, कम उत्सर्जन वाले भविष्य की ओर।
CBG खेतों, मंडियों और गोबर जैसे जैविक कचरे से तैयार होता है। GOBARdhan योजना के तहत इस कचरे को बायोगैस प्लांट्स में प्रोसेस कर CBG बनाया जाता है, जो वाहनों के लिए ईंधन के रूप में इस्तेमाल किया जा सकता है।
यानी वही गाड़ी, वही सफर,… pic.twitter.com/I4uwG4ns3t
— Bharat Petroleum (@BPCLimited) August 11, 2026
తాజావార్తలు
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
-
రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!