Site icon NTV Telugu

CM Zoramthanga: డాక్టర్ ని కొట్టిన సీఎం కూతురు.. “క్షమాపణ” చెప్పిన సీఎం

Mizoram Cm

Mizoram Cm

Mizoram CM Daughter Hits Doctor, Father Says Sorry: తండ్రి అధికారంలో ఉన్నాడు కదా.. అని ఓ కూతురు హద్దు మీరి ప్రవర్తించింది. అయితే ప్రజాజీవితంలో ఉన్న వారు ఎలా ఉండాలో ఆ తండ్రి చేసి చూపించారు. డాక్టర్ పై దాడి చేసిన కూతురు పట్ల బహిరంగంగా క్షమాపణలు కోరారు సీఎం. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో జరిగింది. మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారీ ఛంగ్టే ఓ డాక్టర్ పై చేయి చేసుకుంది. రాజధాని ఐజ్వాల్ లో ఓ క్లినిక్ లో చర్మవ్యాధి నిపుణుడిగా ఉన్న డాక్టర్ పై దాడి చేశారు.

Read Also: Anand Sharma: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. కీలక పదవికి ఆనంద్ శర్మ రాజీనామా.

అయితే డాక్టర్ అపాయింట్మెంట్ లేకపోవడంతో తనను చూడటానికి నిరాకరించడంతో ఆమె ఆగ్రహంతో డాక్టర్ పై దాడిచేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. కన్సల్టేషన్ కు ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలని.. లేకపోతే చూడటం కుదరదని చెప్పడంతో ఆగ్రహంతో ఆమె ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆమెను అక్కడ ఉన్న వారు అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. డాక్టర్ ముఖంపై కొట్టడం వీడియోలో కనిపిస్తోంది.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మిజోరాం యూనిట్ నిరసనలు ప్రారంభించింది. వైద్యులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిన్న విధులు నిర్వహించారు. దీంతో ముఖ్యమంత్రి జోరంతంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా చివరకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. డాక్టర్ పట్ల తన కూతురు తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని.. ఆమె ప్రవర్తనను ఏవిధంగా తాను సమర్థించబోనని ముఖ్యమంత్రి అన్నారు.

Exit mobile version