CM Zoramthanga: డాక్టర్ ని కొట్టిన సీఎం కూతురు.. “క్షమాపణ” చెప్పిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mizoram CM Daughter Hits Doctor, Father Says Sorry: తండ్రి అధికారంలో ఉన్నాడు కదా.. అని ఓ కూతురు హద్దు మీరి ప్రవర్తించింది. అయితే ప్రజాజీవితంలో ఉన్న వారు ఎలా ఉండాలో ఆ తండ్రి చేసి చూపించారు. డాక్టర్ పై దాడి చేసిన కూతురు పట్ల బహిరంగంగా క్షమాపణలు కోరారు సీఎం. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో జరిగింది. మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారీ ఛంగ్టే ఓ డాక్టర్ పై చేయి చేసుకుంది. రాజధాని ఐజ్వాల్ లో ఓ క్లినిక్ లో చర్మవ్యాధి నిపుణుడిగా ఉన్న డాక్టర్ పై దాడి చేశారు.
Read Also: Anand Sharma: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. కీలక పదవికి ఆనంద్ శర్మ రాజీనామా.
Also Read
అయితే డాక్టర్ అపాయింట్మెంట్ లేకపోవడంతో తనను చూడటానికి నిరాకరించడంతో ఆమె ఆగ్రహంతో డాక్టర్ పై దాడిచేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. కన్సల్టేషన్ కు ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలని.. లేకపోతే చూడటం కుదరదని చెప్పడంతో ఆగ్రహంతో ఆమె ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆమెను అక్కడ ఉన్న వారు అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. డాక్టర్ ముఖంపై కొట్టడం వీడియోలో కనిపిస్తోంది.
రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మిజోరాం యూనిట్ నిరసనలు ప్రారంభించింది. వైద్యులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిన్న విధులు నిర్వహించారు. దీంతో ముఖ్యమంత్రి జోరంతంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా చివరకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. డాక్టర్ పట్ల తన కూతురు తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని.. ఆమె ప్రవర్తనను ఏవిధంగా తాను సమర్థించబోనని ముఖ్యమంత్రి అన్నారు.
Chief Minister Zoramthanga in an Instagram post on Saturday said that he would, in no way, justify his daughter’s conducthttps://t.co/HXckrqb53L
— Northeast Now (@NENowNews) August 21, 2022
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?