Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
- యూపీ మహిళలకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్
- రూ.1 లక్ష వరకు వడ్డీ లేని రుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Mahila Udyami Credit Yojana: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆర్థిక పథకాన్ని ప్రతిపాదించింది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ మహిళా ఉద్యమి క్రెడిట్ యోజన పేరుతో ప్రతిపాదిస్తున్న ఈ పథకం ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే నిర్వహిస్తున్న వ్యాపారాలను విస్తరించుకునేందుకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంటుంది.
మూడు విడతల్లో రూ.1 లక్ష
ప్రతిపాదిత పథకం కింద అర్హులైన మహిళలకు మొత్తం రూ.1 లక్షను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందించే అవకాశం ఉంది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
మొదటి విడత: రూ.20,000
రెండో విడత: రూ.30,000
మూడో విడత: రూ.50,000
మొత్తం: రూ.1,00,000
మొదటి విడత రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన మహిళలు రెండో విడతకు అర్హత సాధిస్తారు. రెండో విడతను కూడా సక్రమంగా చెల్లించిన తర్వాత మూడో విడతగా రూ.50,000 పొందే అవకాశం ఉంటుంది.
మహిళా వ్యాపారాలకు ప్రోత్సాహం
మహిళలు కేవలం స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకే పరిమితం కాకుండా సొంతంగా సూక్ష్మ వ్యాపారాలు ప్రారంభించి, వాటిని స్థిరమైన ఆదాయ మార్గాలుగా అభివృద్ధి చేసుకోవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన మహిళలకు ప్రత్యేక క్రెడిట్ కార్డు అందించే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కార్డును చిన్న వ్యాపారం ప్రారంభించేందుకు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
UPSRLM మహిళలకు ప్రయోజనం
ఈ ప్రతిపాదిత పథకాన్ని ఉత్తరప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (UPSRLM)తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన చేసినట్లు సమాచారం. పథకానికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఉన్నతాధికారులతో యోజనా భవన్లో సమావేశం కూడా జరిగినట్లు సమాచారం.
బ్యాంకులతో కలిసి రుణ వ్యవస్థ
ప్రతిపాదిత రుణ సదుపాయానికి సంబంధించిన ప్రాథమిక విధివిధానాలను సిద్ధం చేయాలని బ్యాంకులను కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రామీణాభివృద్ధి శాఖ పథకానికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను రూపొందించే పనిలో ఉన్నట్లు సమాచారం. అయితే పథకం తుది నిబంధనలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, అమలు తేదీపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
మహిళల కోసం డిజిటల్ గుర్తింపు కార్డులు
స్వయం సహాయక సంఘాలతో అనుసంధానమైన మహిళల డిజిటల్ సామర్థ్యాలను పెంచేందుకు కూడా యూపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో QR కోడ్‌తో కూడిన డిజిటల్ ఐడెంటిటీ కార్డులు అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వీటిని డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ మార్కెటింగ్, ఈ-కామర్స్, ఆర్థిక సేవలతో అనుసంధానించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
100 మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
మహిళలకు ఆర్థికంగా మరింత స్వావలంబన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహిస్తున్న సంప్రదాయ కార్యకలాపాలను దాటి చిన్న, స్థిరమైన వ్యాపారాలను నిర్మించుకునేలా ఈ చర్యలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్నికల వేళ కీలక ప్రకటన
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళలకు ఆర్థిక సహాయం అందించే అంశం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో మహిళలకు రూ.50,000 ఆర్థిక సాయం అందించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ, అప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు కోటి మంది మహిళలకు మూడు విడతల్లో రూ.1 లక్ష వరకు వడ్డీ లేని క్రెడిట్ సదుపాయం కల్పించే ప్రతిపాదన తెరపైకి రావడంతో ఈ పథకంపై ఆసక్తి పెరిగింది. అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదిత పథకమే కావడంతో తుది మార్గదర్శకాలు, అర్హతలు, అమలు వివరాల కోసం ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!