NTV Telugu Site icon

UP: డీజీపీపై వేటు వేసిన సీఎం యోగి

Dgp Mukul Goel

Dgp Mukul Goel

ఉత్తరప్రదేశ్‌ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర వేశారు.. ఇక, ఈ మధ్యే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో మరోసారి సీఎం అయ్యారు.. అయితే, యూపీ డీజీపీ ముకుల్‌ గోయల్‌పై వేటు వేశారు సీఎం యోగి.. ముకుల్‌ గోయల్‌ను విధుల నుంచి అర్ధాంతరంగా తప్పిస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు.. తమ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలోనే యోగీ సర్కార్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది..

Read Also: CBI Raids: స్వచ్ఛంద సంస్థలే టార్గెట్‌.. 40 చోట్ల సీబీఐ దాడులు..

11 నెలలకు పైగా రాష్ట్ర డీజీపీగా ఉన్న గోయెల్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా నియమితులయ్యారు. అతనికి ఇంకా దాదాపు రెండేళ్ల సర్వీస్ ఉంది మరియు 2024 ఫిబ్రవరి చివరిలో పదవీ విరమణ చేయనున్నారు. కానీ, మధ్యలోనే ఆయనను తప్పించారు సీఎం యోగి.. హోం శాఖ అధికారుల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం, శాఖాపరమైన పనులపై ఆసక్తి చూపడం లేదంటూ ఆరోపణలు ఉన్నాయి.. ఇక,
డీజీపీని తప్పించడంతో.. అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ), లా అండ్ ఆర్డర్, ప్రశాంత్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. 1987 ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ముకుల్‌ గోయల్‌.. గతంలో పలు కీలక పదవులు చేపట్టారు. గతంలో బీఎస్‌ఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.