CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ

  • హస్తినలో కొనసాగుతోన్న సీఎం విజయ్ పర్యటన
  • సాయంత్రం ప్రధాని మోడీతో సమావేశం
  • అనంతరం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
  • రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
Cmvijay3

Cmvijay3

హస్తినలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం ప్రధాని మోడీని కలిసిన విజయ్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం విజయ్ భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో తమిళనాడుకు సంబంధించిన పలు ఆర్థిక, అభివృద్ధి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రానికి కేంద్ర నిధుల కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల పెట్టుబడులు, డిజిటల్ మరియు రక్షణ రంగాల్లో సహకారం వంటి అంశాలను విజయ్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర-రాష్ట్ర సమన్వయం, అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం వంటి అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. తమిళనాడులో పెట్టుబడులను మరింత పెంచేందుకు కేంద్రం సహకరించాలని విజయ్ కోరినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని మోడీతో కూడా విజయ్ సమావేశమై మేకేదాటు ప్రాజెక్టు, తమిళ్ థాయ్, డీఆర్‌డీవో సెంటర్ వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే ఢిల్లీ పర్యటనలో మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలిసే ఛాన్సుందని తెలుస్తోంది.