Site icon NTV Telugu

చెన్నై కి ఎవరు రావొద్దు : సీఎం స్టాలిన్

చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఆ సమీక్షలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ… మూడు రోజులపాటు చెన్నైకి ఎవరూ రావొద్దు అని కోరారు. చెన్నై నుంచి ఎవరూ వెళ్లొద్దు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి అని సూచించారు. ఇక చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సీఎం సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలి అని ఆదేశాలు జారీ చేసారు. అయితే అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పులాల్ రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో పెరుగుతున్న విషయం తెలిసిందే.

Exit mobile version