Site icon NTV Telugu

వైరల్‌: గొంతు సవరించిన సీఎం.. ‘షోలే’ సాంగ్‌తో…

Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan

ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు.. కొన్ని సార్లు గొంతు సవరించాల్సి వస్తే.. మరికొన్ని సార్లు కాలు కదిపి స్టెప్పులు కూడా వేయాల్సి వస్తుంది… తాజాగా.. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారిపోయింది… సింగర్‌గా మారిపోయిన సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలేష్‌ విజయ్‌వర్గీయతో కలిసి పాటందుకున్నారు.. భోపాల్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు దిగ్గజ నేతలు.. ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం షోలే పాట పాడారు… ఆ మూవీలోని ఏ దోస్తీ హమ్‌ నహీ చోడేంగే.. అనే పాటను తమ స్నేహానికి ప్రతీకగా పాడుకున్నారు.

ముందుగా కైలేష్‌ వియ్‌ వర్గీయ పాట అందుకోగా.. ఆ తర్వాత సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ కూడా గొంతు కలిపారు.. మొత్తంగా అద్భుతంగా ఆ పాటను ఆలపించారు.. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. సీఎం చౌహాన్‌ కూడా ఆ వీడియోను షేర్‌ చేశారు. ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు…

Exit mobile version