NTV Telugu Site icon

CM Revanth Reddy: ఢిల్లీ లోనే రేవంత్ రెడ్డి.. నేడు ప్రధానితో భేటీ..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లతో భేటీకానున్నారు. ఇవాళ కొద్ది సేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు అమిత్ షా భేటీ అనంతరం, మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రధాని మోడీతో భేటీకానున్నారు. రాష్ట్రానికి పలు కీలక అంశాలను ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న తరుణంలో తెలంగాణ సమస్యలను తమ దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కోరారు. తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సీఎం.. ఇక ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడమే మిగిలిందన్నారు.

Read also: Pawan Kalyan: పిఠాపురంలో స్థలం కొన్న పవన్‌ కల్యాణ్‌.. ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు!

నేటి సమావేశంలో రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉందని, వచ్చే బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలను ఇరువురు నేతల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇవాళ మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతున్నారు. విభజన సమస్యలపై 6వ తేదీన హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కాకముందే.. ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రిని ఇద్దరూ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే… ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం మాత్రం ఈ భేటీ ఏ సమయానికి సంబంధించినది మాత్రం ఇంకా నిర్ధారించలేదు.
Surya Namaskar : ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే ఎన్ని ఉపయోగాలో తెలుసా..