NTV Telugu Site icon

MK Stalin: 2026లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో గెలుస్తాం.. వారిపై నమ్మకం ఉంచండి..!

Stalin

Stalin

MK Stalin: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సేవలు మరో శతాబ్దానికి అవసరం.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అపూర్వ విజయాన్ని అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పార్టీ కార్యకర్తలను కోరారు. డీఎంకే పార్టీ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మేం 25, 50, 75వ వార్షికోత్సవాలు జరుపుకున్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉందన్నారు. మనం 100వ జయంతి జరుపుకునే సమయంలో డీఎంకే అధికారంలో ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. మా తదుపరి లక్ష్యం 2026 ఎన్నికలే అని డీఎంకే చీఫ్ అన్నారు. మహిళలు, మైనారిటీలు, సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల సాధికారత కోసం తాము పని చేస్తామని సీఎం స్టాలిన్ చెప్పుకొచ్చారు.

Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల

ఇక, తమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం పాలనలో లేనందున మేము ఇంకా మా కలలను నెరవేర్చుకోలేదు అని సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. డీఎంకే ఇప్పటికీ దానిని సాధించడానికి ప్రయత్నిస్తోంది.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)పై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొద్దిపాటి నిధుల ప్రవాహం ఉన్నప్పటికీ.. విభిన్న రంగాలలో గణనీయమైన విజయాన్ని సాధస్తున్నామని చెప్పారు. పూర్తి ఆర్థిక కేటాయింపులు జరిగితే తమిళనాడును దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దగలం అని ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు.

Read Also: Karnataka Governor: అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై విచారణకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం..!

కాగా, తమిళనాడులో పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను ఇటీవల అమెరికా పర్యటనను గుర్తు చేసుకున్నారు సీఎం స్టాలిన్.. ఆర్థిక కట్టుబాట్లు వేలాది మందికి ఉపాధి కల్పనకు దోహదపడతాయని అన్నారు. రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు, ఇప్పుడు 75వ వార్షికోత్సవం జరుపుకున్నప్పుడు పార్టీ అధికారంలో ఉంది.. శతాబ్ది ఉత్సవాలు జరుపుకునేందుకు అధికారంలో కొనసాగుతుందని.. మరో శతాబ్ది పాటు డీఎంకే పార్టీ అధికారంలో కొనసాగుతుందని ఆయన అన్నారు.

Show comments