రాష్ట్రపతి, ప్రధానికి దీదీ లేఖ… గవర్నర్‌ను మార్చేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికలకు ముందు… ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హాట్ టాపిక్‌గానే మారిపోతున్నాయి.. గవర్నర్‌ను మార్చాలంటూ తాజాగా టీఎంసీ అధినేత్రి, బెంగాల సీఎం మమతా బెనర్జీ… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాయడం సంచలనంగా మారింది..నారద స్కామ్‌లో ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి, మాజీ మేయర్‌తో పాటు నలుగురు తృణమూల్ నేతలను సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఈ లేఖలు రాశారు దీదీ.. రాష్ట్రంలో సుపరిపాలన కోసం గవర్నర్‌ను వెంటనే మార్చాలని విజ్ఞప్తి చేశారు. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. గవర్నర్ జగదీప్ ధంఖర్.. టీఎంసీ సర్కార్‌కు వ్యతిరేకంగా అసాధారణమైన రీతిలో మాట్లాడుతున్నారు.. శాంతి, భద్రతలను అదుపులో ఉంచకపోతే తీవ్ర చర్యలు తప్పవంటూ సీఎం మమతా బెనర్జీని హెచ్చరించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని.. అధికారులు పూర్తిగా కరోనా నిరోధనలో బిజీగా ఉన్నారని లేఖలో ప్రధానికి వివరించారు దీదీ.. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాంతి, భద్రతల సమస్యను లేవనెత్తడం, దాని గురించి పబ్లిక్ డొమైన్‌లో ట్వీట్ చేయడం ద్వారా ధంఖర్ అన్ని పరిమితులను దాటుతున్నారని.. ప్రభుత్వ పనితీరును అస్థిరపరిచేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని.. సుపరిపాలన అందించాలంటే వెంటనే గవర్నర్‌ను మార్చేయాలని పేర్కొన్నారు.
Also Read
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Tags
- West Bengal Governor
తాజావార్తలు
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!