Mamata Banerjee-EC: ‘సర్’పై నేడు ఈసీని కలవనున్న సీఎం మమత

  • సీఎం మమతకు ఈసీ అపాయింట్‌మెంట్
  • నేడు ఈసీని కలవనున్న సీఎం మమత
  • ప్రత్యేక ఓటర్ సర్వేపై ఫిర్యాదు చేయనున్న మమత
Mamata Banerjee Ec

Mamata Banerjee Ec

ఢిల్లీ వేదికగా ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాటానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. ‘‘సర్’’కు వ్యతిరేకంగా హస్తినలో తృణమూల్ కాంగ్రెస్ ఫైట్ చేయబోతుంది. త్వరలో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే (SIR) చేపట్టింది. అనంతరం లక్షలాది ఓట్లను తొలగించింది. దీంతో ఈసీకి వ్యతిరేకంగా మమత గళం విప్పారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: Bihar: ప్రియుడు ఉండగా మరొకరితో పెళ్లికి రెడీ.. సీన్ కట్ చేస్తే ఎంత ఘోరానికి ఒడిగట్టిందంటే..!

ఇదిలా ఉంటే సీఎం మమతకు ఇవాళ ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఇందుకోసం ఆమె ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆమె ఎన్నికల సంఘాన్ని కలిసి ‘‘సర్’’పై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే సుప్రీంకోర్టులో జరిగే విచారణకు కూడా ఆమె హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ వేదికగా టీఎంసీ నాయకులు పోరాటానికి రెడీ అవుతున్నట్లు కూడా కనిపిస్తోంది. అటు పార్లమెంట్‌లోనూ… ఇటూ పబ్లిక్‌గానూ నిరసనలు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: UP: 9 ఏళ్లుగా లవ్.. 2 నెలల క్రితం పెళ్లి.. శవమైన భర్త.. మిస్టరీ ఏంటంటే..!