పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రతిపాదనపై తీసుకొచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: రూపాయి విలువ పడిపోతే నన్నెందుకు అడుగుతున్నారు.. వాళ్లను అడగండి.. ప్రియాంకాగాంధీ రుసరుసలు
బాబ్రీ మసీదు ప్రతిపాదనపై పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరాలు ఉన్నప్పటికీ డిసెంబర్ 6న ముర్షిదాబాద్‌లోని బెల్దంగాలో బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయాలనే ప్రణాళికను హుమాయున్ కబీర్ ప్రకటించారు. దీంతో పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొండిగా వ్యవహరించిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: MSG : మనశంకర వరప్రసాద్.. సెకండ్ సాంగ్ రిలీజ్ కు డేట్ లాక్
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ ప్రత్యేక సర్వేపై గురువారం భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులోని ముర్షిదాబాద్ జిల్లాలో నిరసనలకు మమత పిలుపునిచ్చారు. అయితే నిరసన ర్యాలీలో పాల్గొనే ముందు మమత ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది.
‘‘ముర్షిదాబాద్‌కు చెందిన మా ఎమ్మెల్యేలలో ఒకరు అకస్మాత్తుగా బాబ్రీ మసీదును నిర్మిస్తానని ప్రకటించడాన్ని మేము గమనించాము. అకస్మాత్తుగా బాబ్రీ మసీదు ఎందుకు? మేము ఇప్పటికే అతన్ని హెచ్చరించాము. టీఎంసీ నిర్ణయం ప్రకారం మేము ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను సస్పెండ్ చేస్తున్నాము.’’ అని పార్టీ నాయకుడు, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 6న ముర్షిదాబాద్‌లోని బెల్దంగాలో బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయాలనే ప్రణాళికను ఎమ్మెల్యే కబీర్ తీసుకొచ్చారు. అయితే హుమాయున్ కబీర్ ప్రకటనలు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తుంటే… ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని వర్గాలు తెలిపాయి. మొత్తానికి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటన చేయడంతో ఎమ్మెల్యే కబీర్‌ను సస్పెండ్ చేశారు.
