Site icon NTV Telugu

Mamata Banerjee: అమిత్ షా ‘దుర్మార్గుడు.. నీచుడు’ హోంమంత్రిపై మమత ఆగ్రహం

Amitshah

Amitshah

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈడీ దాడులు రాజకీయ దుమారం రేపుతోంది. గురువారం అనూహ్యంగా కోల్‌కతాలో పలుచోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఐపీఏసీ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంపై అధికారులు దాడులు చేశారు. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి సంఘటనాస్థలికి చేరుకున్నారు. మమత రాకతో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. హోంమంత్రి అమిత్ షాపై నిప్పులు చెరిగారు. ‘‘పార్టీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను, అభ్యర్థుల జాబితాను సేకరించడమే ఈడీ, అమిత్ షా పనినా? దేశాన్ని రక్షించలేని ఈ నీచమైన, దుష్ట హోంమంత్రి నా పార్టీ పత్రాలను ఎలా తీసుకెళ్తాడు. నేను గనుక బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఒక వైపు పశ్చిమ బెంగాల్‌లో SIR నిర్వహించి ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారు. ఇప్పుడేమో నా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.’’ అంటూ మమత ధ్వజమెత్తింది.

 

Exit mobile version