Chopper Makes Emergency Landing: బీహార్ లో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు, సమీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు సీఎం నితీష్ కుమార్. శుక్రవారం ఔరంగాబాద్, జెహానాబాద్, గయా జిల్లాల్లోని కరువు పీడి ప్రాంతాల్లో సీఎ నితీష్ కుమార్ ఏరియస్ సర్వే చేసే షెడ్యూల్ ఉంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అడ్డంకిగా మారాయి. దీంతో సీఎం నితీష్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గయాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బ్యాడ్ వెదర్ కారణంగా హెలికాప్టర్ ప్రయాణానికి ఆటంకం ఏర్పడటంతో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పాట్నా తిరిగి వెళ్తుండగా.. గయ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెలికాప్టర్ అత్యవసర లాండింగ్ చేసినట్లు మగద్ రేంజ్ ఐజీ వినయ్ కుమార్ వెల్లడించారు. వాతావరణం అనుకూలించపోవడంతో సీఎం నితీష్ కుమార్ రోడ్డు మార్గంలో పాట్నాకు వెళ్లారు. బీహార్ వ్యాప్తంగా రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్రయంత్రాంగం అప్రమత్తం అయింది.
Read Also: ICICI Bank: ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ
ఇటీవలే బీజేపీ పొత్తును వదులుకున్న నితీష్ కుమార్.. తన జేడీయూ పార్టీతో ఆర్జేడీ పార్టీని కలుపుకుని మహాగటబంధన్ కూటమిని ఏర్పాటు చేశారు. మళ్లీ నితిష్ కుమార్ సీఎంగా.. ఆర్జేడీ నేత, లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఇటీవల 31 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం జరిగింది.