Cloudburst: డెహ్రాడూన్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు
- డెహ్రాడూన్‌లో క్లౌడ్ బరస్ట్
- కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు, ఇళ్లులు
- ఇద్దరు వ్యక్తులు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. డెహ్రాడూన్‌లో మంగళవారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తికొచ్చాయి. దీంతో కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లులు ధ్వంసమయ్యాయి. అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Train Video: ఏసీ కోచ్‌లో మహిళ ధూమపానం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరదలు ముంచెత్తికొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. సంఘటనాస్థలికి జిల్లా మేజిస్ట్రేట్ సివాన్ బన్సాల్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కుంకుమ్ జోషి, ఇతర అధికారులు చేరుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇక గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీడబ్ల్యూడీ అధికారులు బుల్డోజర్లతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. ఇక భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్‌లోని 1-12 తరగతుల వరకు అన్ని పాఠశాలలు మూసివేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Train Ticket: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వే రిజర్వేషన్లో కీలక మార్పులు.. సాధారణ రిజర్వేషన్‌కు అది తప్పనిసరి!
భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం కారణంగా ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఉత్తరకాశీలోని ధరాలి-హర్సిల్, చమోలిలోని తరాలి, రుద్రప్రయాగ్‌లోని చెనాగడ్, పౌరిలోని సైన్జీ, బాగేశ్వర్‌లోని కాప్కోట్, నైనిటాల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఉత్తరాఖండ్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా 85 మంది మరణించగా.. 128 మంది గాయపడ్డారు. 94 మంది తప్పిపోయారు. ఇక సెప్టెంబర్ 11న ప్రధాని మోడీ విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. డెహ్రాడూన్‌ను సందర్శించి రూ.1,200 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించారు.
#WATCH | Uttarakhand | Tamsa river in spate and Tapkeshwar Mahadev temple inundated as heavy rainfall lashes Dehradun.
Temple priest Acharya Bipin Joshi says, "The river started flowing heavily since 5 AM, the entire temple premises were submerged… This kind of situation had… pic.twitter.com/4E6PhKBM6K
— ANI (@ANI) September 16, 2025
#WATCH | Uttarakhand | Tamsa river in full spate as heavy rainfall lashes Dehradun.
1-2 feet of debris has accumulated in the Tapkeshwar Mahadev Shivalinga complex, and there has been a lot of damage in the temple premises. pic.twitter.com/jR8AiTp7EA
— ANI (@ANI) September 16, 2025
#WATCH | Uttarakhand: A local says, "Around 4:45 am, the water entered the cave… Later, when the water level started increasing, it rose to 10-12ft… The water reached above the 'Shivling'… Somehow, we made our way, and with the help of the rope, we came up…" https://t.co/VyNxOcWDc3 pic.twitter.com/7R9FL4MsiB
— ANI (@ANI) September 16, 2025
#WATCH | Uttarakhand: Due to the heavy rainfall since last night, the bridge near Fun Valley and Uttarakhand Dental College on the Dehradun–Haridwar National Highway has been damaged.
(Source: Police) pic.twitter.com/4dHTscMg7G
— ANI (@ANI) September 16, 2025
#WATCH | Himachal Pradesh: Last night, heavy rain lashed the Mandi district, causing major destruction in Dharampur town. Many vehicles were swept away.
(Source: Police) pic.twitter.com/AlJUarMO0H
— ANI (@ANI) September 16, 2025
తాజావార్తలు
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!