Uttarakhand: డెహ్రాడూన్‌ను తాకిన క్లౌడ్‌బరస్ట్.. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand:: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా రాయ్‌పూర్ బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు రాయ్‌పూర్ బ్లాక్‌లో సర్ఖేత్ గ్రామంలో వర్షం బీభత్సం సృష్టించినట్లు స్థానికులు వెల్లడించారు. వరదలు ఆ గ్రామాన్ని అల్లకల్లోలం చేశాయి. సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(SDRF) బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామంలో చిక్కుకున్న ప్రజలందరినీ రక్షించారు. కొందరు సమీపంలోని రిసార్ట్‌లో ఆశ్రయం పొందారని ఎస్డీఆర్ఎఫ్ తెలిపింది.
‘‘శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం సమీపంలో ప్రవహించే తమసా నది భీకరమైన రూపాన్ని సంతరించుకుంది. దీని కారణంగా మాతా వైష్ణో దేవి గుహ యోగ దేవాలయం, తపకేశ్వర్ మహాదేవ్ ఆలయాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు’’ అని ఆలయ వ్యవస్థాపకుడు ఆచార్య బిపిన్ జోషి తెలిపారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
Rajasthan Accident: ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిన ట్రక్కు.. 6గురు దుర్మరణం
ఇదిలా ఉండగా, జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రా పట్టణంలోని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం సమీపంలో శనివారం భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల దృష్ట్యా మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. “భారీ వర్షాల నేపథ్యంలో, కత్రా నుండి వైష్ణో దేవి ఆలయానికి యాత్రికుల తరలింపు నిలిపివేయబడింది. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇప్పటికే మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు” అని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు తెలిపింది.
అంతకుముందు జూలైలో, అమర్నాథ్ పవిత్ర గుహ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. ఆ సమయంలో వరదల కారణంగా చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయారు. కొన్ని రోజుల పాటు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
#WATCH | Uttarakhand: Flash-flood-like situation due to incessant torrential rainfall at Tapkeshwar Mahadev temple in Dehradun pic.twitter.com/Q43inmiVht
— ANI (@ANI) August 20, 2022
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..