NTV Telugu Site icon

MP: క్రమశిక్షణే మారణశాసనం అయింది.. ప్రిన్సిపాల్‌ను చంపిన విద్యార్థి

Gunfire

Gunfire

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించే గురువునే చంపాడు ఓ విద్యార్థి. ఛతర్‌పుర్‌ జిల్లాలోని ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌కే సక్సేనా (55) ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ప్రిన్సిపాల్‌ బాత్రూమ్‌కు వెళ్లారు. కాపు కాసిన 12వ తరగతి విద్యార్థి ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా కాల్పులకు బెగబడ్డాడు. తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో సక్సేనా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం మరో స్నేహితుడితో స్కూటర్‌పై పారిపోయారు. సక్సేనా ఐదేళ్లుగా పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారి తెలిపారు. విద్యార్థులను మందలించినందుకే ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ 2025లో అన్ని జట్ల హెడ్ కోచ్‌లు వీళ్లే..

కుట్రలో భాగంగానే సక్సేనా హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్కూల్‌లో కొందరు ఒత్తిడి చేస్తున్నారని.. తప్పుడు పనులు చేసేందుకు ఒప్పుకోకపోవడం వల్లే చంపేశారని పేర్కొన్నారు. కుట్ర పన్నిన వాళ్లను పట్టుకోవాలని పోలీసులను కుటుంబ సభ్యులు కోరారు.

ఇది కూడా చదవండి: Delhi: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. విద్యాసంస్థలు కేటాయించిన కేంద్రం

Show comments