CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..

  • సీజేపీ అధికార ప్రతినిధి ‘‘బర్గర్ వీడియో ’’ వైరల్..
  • ఉద్యమ విలువలకు విరుద్ధంగా ప్రవర్తించారన్న పార్టీ..
  • పదవి నుంచి తొలగించిన సీజేపీ..
Cjp (1)

Cjp (1)

CJP: పార్లమెంట్ మార్చ్ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధికార ప్రతినిధి విజేత దహియా ‘‘బర్గర్’’ తినడం వైరల్‌గా మారింది. బర్గర్ వీడియో వివాదం నేపథ్యంలో సీజేపీ అతడిని పదవి నుంచి తొలగించింది. సోమవారం జరిగిన నిరసన మార్చ్ సందర్భంగా విజేత దహియా బర్గర్ తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై దహియా స్పందిస్తూ.. ‘‘నేను బర్గర్ ఎందుకు తిన్నాను..? ఆకలిగా ఉండటంతో లేదా తినాలనిపించడంతో తిన్నాను అంతే’’ అని చెప్పారు. ‘‘నేను ఎవరికి జవాబుదారీని కాదు, నేను దేశం కోసం స్వచ్ఛందంగా చేస్తున్నాను, బర్గర్ తింటాను కూడా’’ అంటూ వ్యాఖ్యానించారు.

అయితే, తీవ్రమైన నిరసన జరుగుతున్న సమయంలో సీజేపీ అధికార ప్రతినిధి ఇలా బర్గర్ తింటూ ప్రవర్తించడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడిని పదవి నుంచి తొలగించింది. ఉద్యమ విలువలకు విరుద్ధంగా ప్రవర్తించడాన్ని ఖండించింది. సోమవారం పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం, ఈ ఘర్షణల్లో 178 మంది గాయపడగా, ఇందులో 118 మంది పోలీసులు ఉన్నారు. మరో 60 మంది నిరసనకారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.