CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- సీజేపీ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఘోర అవమానం..
- విమానంలో అరెస్ట్ చేసే సమయంలో ప్రయాణికుల నుంచి సీజేపీపై వ్యతిరేకత..
- షేమ్, స్వచ్చ భారత్-చెత్తను తీసేయండి అంటూ పోలీసులకు మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఢిల్లీలో అక్టోబర్ 10 శనివారం భారీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే, ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలతో సీజేపీ ప్రయత్నాలను వమ్ము చేశారు. ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను విమానంలోనే అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు.
ఇదిలా ఉంటే, విమానంలో పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో హైడ్రామా నెలకొంది. తోటి ప్రయాణికుల నుంచి సీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఈ వీడియోను పంచుకుంటూ.. ‘‘పౌరుల ద్వారానే చెత్త నియంత్రణ’’ అంటూ కామెంట్ చేశారు. ప్రయాణికులు సీజేపీ లీడర్లను ఉద్దేశించి ‘‘మీకు సిగ్గుండాలి’’, ‘‘స్వచ్ఛ భారత్, చెత్తను శుభ్రం చేయండి’’ అని కామెంట్స్ చేశారు. ఈ వీడియోను ఉద్దేశిస్తూ తేజస్వీ సూర్య.. ‘‘సీజేపీ గురించి నిజమైన పౌరులు ఏంటున్నారో వినండి’’ అని కామెంట్ పోస్ట్ చేశారు.
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
వీడియోలో అభిజిన్ తనను అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసురుతూ.. తనపై UAPA, NSA కేసులు పెట్టుకోండి అంటూ నిరసన తెలిపారు. సీజేపీ కోకన్వీనర్ సౌరవ్ దాస్ ఒక మహిళా ప్రయాణికురాలితో ‘‘షేమ్ అన్ యూ’’ అంటూ కామెంట్ చేయగా, మహిళ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘షేమ్ ఆన్ యూ’’ అని బదులు ఇచ్చింది. మరో ప్యాసింజర్ ‘‘కచరా సాఫ్, స్వచ్ఛ భారత్ అభియాన్’’అని అంటుండటం వినొచ్చు. సీజేపీ నేతల అరెస్ట్ డ్రామాతో చాలా మంది ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Chad pest control by citizens!
‘Shame on you’ ‘Desh Drohi’ ‘Swach Bharat’ ‘Kachra Saaf’
Listen to what real citizens have to say about these guys. https://t.co/Jg3DWfQTno
— Tejasvi Surya (@Tejasvi_Surya) October 10, 2026
తాజావార్తలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!