NTV Telugu Site icon

Sambhal Jama Masjid: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘సంభాల్ జామా మసీద్’’ వివాదం..

Sambhal Jama Masjid

Sambhal Jama Masjid

Sambhal Jama Masjid: ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్‌ సంభాల్ నగరంలో జామా మసీదు అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదివారం మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇళ్లను ధ్వంసం చేశారు.ఈ హింసాత్మక ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసును ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ఉన్నతస్థాయిలో విచారిస్తోంది. ఇప్పటికే 20కి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 7 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ఇదిలా ఉంటే, ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. నవంబర్ 19న లోకల్ కోర్టు ఇచ్చిన సర్వే ఆర్డర్‌కి వ్యతిరేకంగా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం రేపు ఈ పిటిషన్‌ని విచారించనుంది. మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు ఒకప్పుడు హరిహర్ మందిరమని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాబర్ సమయంలో ఈ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించినట్లు చారిత్రక గ్రంథాలను ఆధారాలుగా హిందూ పక్షం కోర్టు ముందుంచింది. ఈ నిర్మాణం ప్రస్తావన ‘‘బాబర్ నామా’’, ‘‘ఐన ఈ అక్బరీ’’ వంటి మొఘలులు కాలం నాటి గ్రంథాల్లో పేర్కొనబడిందని హిందూ పక్షం ప్రస్తావించింది.

Show comments