పొగ తాగే వారికి ప్రభుత్వం షాకివ్వబోతోంది. త్వరలో సిగరెట్ల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని పరిశీలిస్తోంది. దీంతో పన్ను ఆదాయం తగ్గదు. ప్రస్తుతం వీటిపై 28 శాతం జీఎస్టీ కాకుండా ఇతర ఛార్జీలు కూడా విధిస్తున్నారు. దీంతో మొత్తం పన్ను 53 శాతానికి చేరుకుంది. అయితే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 75 శాతం కంటే చాలా తక్కువ. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విధించే పరిహార సెస్సు ముగిసే సమయంలో, వాటిపై జీఎస్టీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read:Lavanya: శరవేగంగా సిద్ధమవుతున్న ‘సతీ లీలావతి’
త్వరలో జీఎస్టీని 40 శాతం చేయడంతో పాటు ఎక్సైజ్ డ్యూటీని ప్రత్యేకంగా విధించాలని కేంద్రం భావిస్తున్నది. సాధారణంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి వాటిని ‘పాపపు వస్తువులు’ క్యాటగిరీలో చేర్చారు. అందుకే వాటి వినియోగాన్ని తగ్గించేందుకు భారీగా పన్ను విధిస్తారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు భారీ పన్ను ఆదాయాన్ని అందిస్తాయి.