NTV Telugu Site icon

Cigarette Prices: బడ్జెట్‌లో పొగాకుపై పెరగని పన్ను.. సిగరేట్ రేట్లు యథాతథం..

Cigarette Prices

Cigarette Prices

Cigarette Prices: 2024 బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు పెంచలేదు. దీంతో సిగరేట్ల ధరలపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. పొగాకుపై పన్ను రేట్లను పెంచకపోవడంపై, దేశంలో అతిపెద్ద సిగరేట్ ఉత్పత్తిదారు ఐటీసీ ఈ చర్యను స్వాగతించింది. బడ్జెట్ ఎఫెక్ట్ వల్ల దీని షేర్లు 5 శాతం వరకు పెరిగాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో ఈ స్టాక్ చివరిసారిగా 4.67% లాభంతో రూ. 488.35 వద్ద ట్రేడవుతోంది.

Read Also: Vulture Population: భారత్‌లో క్షీణించిన రాబందుల జనాభా.. మనుషుల అకాల మరణాలతో లింక్..

పొగాకు ఉత్పత్తులపై పన్ను విధించడం ప్రాథమికంగా GST కౌన్సిల్ అధికార పరిధిలోకి వస్తుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం సిగరేట్‌లపై జాతీయ విపత్తు ఆకస్మిక సుంకాన్ని (NCCD) విధిస్తుంది. కేంద్ర బడ్జెట్ సమయంలో దీనిని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటారు. అయితే, ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పొగాకుపై పన్నులు పెంచలేదు. అంతకుముందు ఏడాది NCCDని 16 శాతం పెంచారు.

ఐటీసీకి సిగరెట్ల ఉత్పత్తి ప్రధాన ఆదాయం. కంపెనీ నికర లాభంలో 80 శాతానికి పైగా, మొత్తం ఆదాయంలో 45 శాతనికి పైగా దోహదపడుతోంది. పొగాకుపై పన్ను విధించకపోవడంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో ఒక్కో షేరుకు రూ. 467.05 వద్ద ప్రారంభమైంది, ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ. 489.80 చేరకుని, రూ. 466.55 కనిష్టానికి చేరుకుంది.