Site icon NTV Telugu

పాశ్వాన్ పార్టీలో ఆదిప‌త్య‌పోరు…లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చిరాగ్ లేఖ‌…

లోక్ జ‌న‌స‌త్తా పార్టీలో ఆదిప‌త్య‌పోరు మొద‌లైంది.  ఆ పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్యాన్ కు ఆయ‌న చిన్నాన్న పశుప‌తి కుమార్ పార‌స్‌కు మ‌ధ్య అదిప‌త్య‌పోరు జ‌రుగుతున్న‌ది. లోక్‌స‌భ స‌భాప‌క్ష నాయ‌కుడిగా ప‌శుప‌తిని గుర్తించ‌డంపై చిరాగ్ పాశ్వాన్ మండిప‌డుతున్నారు.  త‌మ పార్టీ నియ‌మావ‌ళిలోని 26 వ అధిక‌ర‌ణ ప్ర‌కారం లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఎవ‌రు ఉండాల‌నే దానిని సెంట్ర‌ల్ పార్ల‌మెంట‌రీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంద‌ని, కాని, అలాంటివి ఏమీ జ‌ర‌గ‌కుండానే ప‌శుప‌తి కుమార్ పార‌స్ ను ఎలా నాయ‌కుడిగా నిర్ణ‌యిస్తార‌ని ప్ర‌శ్నించారు.

Read More మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మ‌న్‌గా స‌త్య‌నాదెళ్ల‌…

పార్టీలోని ఐదుగురు ఎంపీల‌ను బ‌హిష్క‌రించార‌ని, అందువ‌ల్ల నిర్ణ‌యాన్ని మ‌రోసారి స‌మీక్షించాల‌ని కోరారు.  త‌న తండ్రి బ‌తికి ఉన్న స‌మ‌యంలోనే పార్టీలో కుట్ర‌లు జ‌రిగాయ‌ని, తాను ఎవ‌రికి భ‌య‌ప‌డేది లేద‌ని పోరాటం చేస్తామ‌ని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.  

Exit mobile version