సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రూట్లను వెదుకుతూనే ఉన్నారు.. చివరకు పండుగలను కూడా వదలడం లేదు.. పండుగల మెసేజ్ పేరుతో ఏదో లింక్ పంపండం.. ఆ లింక్ మాటున.. వివరాలను సేకరించి.. మోసాలకు పాల్పడుతున్నారు.. దీపావళి పండుగకు ముందు.. ఆ పండుగ పేరుతో నయా ఫ్రాడ్‌కు తెరలేపారు కేటు గాళ్లు.. దీపావళి సందడి భారత్‌లో మొదలైన తరుణంలో దీపావళి మెసేజెస్, గిఫ్ట్స్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొన్ని చైనీస్ వెబ్‌సైట్స్.. ఫ్రీ దివాళీ గిఫ్ట్స్ పేరుతో పిషింగ్ లింక్స్‌ను సెండ్ చేసి.. యూజర్ల వివరాలను గుట్టుగా సేకరిస్తున్నాయి.. ఈ వ్యవహారాన్ని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గిఫ్ట్ ల మాటును ఉన్న ఈ స్కామ్ సంగతి ఏంటి? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా వివరించింది.
Read Also: Crackers Prices: తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి.. కొండెక్కిన క్రాకర్స్
ఇక, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. దీపావళి మాటను జరుగుతోన్న స్కామ్, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొన్ని కీలక సూచనలు చేసింది.. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి విభిన్నమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ఫేక్ మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయని.. లింక్ క్లిక్ చేస్తే పండుగ సందర్భంగా గిఫ్ట్, ప్రైజ్ గెలుచుకోవచ్చని.. ఓ లింక్ ద్వారా ప్రజలకు ఎరవేస్తున్నారని.. అప్రమత్తం చేశారు.. ముఖ్యంగా సైబర్ నేరస్థులు ఎక్కువగా మహిళలను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లకు ఈ మెసేజ్‌లు పంపుతున్నారని CERT-In పేర్కొంది. అయితే, అలాంటి ఫేక్ మెసేజ్‌లను నమ్మి కొందరు లింక్‌లపై క్లిక్ చేసి చిక్కుల్లో పడుతున్నారని.. సంబంధిత లింక్ క్లిక్ చేయడం.. అక్కడ అడిగిన వివరాలను మొత్తం ఇవ్వడంతో.. చాలా మంది సైబర్ చీటర్స్ ఉచ్చులో పడుతున్నారని తెలిపింది.. అయితే, వివరాలు పొందుపర్చిన తర్వాత.. సైబర్ నేరస్థులు.. ఫేక్ కంగ్రాచులేషన్స్ మెసేజ్‌ను కూడా పంపి కొంత నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.. ఆ తర్వాత పర్సనల్ డీలైల్స్, బ్యాంకింగ్ వివరాలను సైతం అడుగుతున్నారు.. వారిని నమ్మి ఆ వివరాలు కూడా ఇస్తే.. మీ పర్సనల్, బ్యాంకింగ్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుందని.. అందినకాడికి కాజేస్తున్నారని హెచ్చరించింది.. ఉచిత బహుమతులు, ప్రైజ్‌లు గెలుపొందారని మీకు మెసేజ్‌లు వస్తే ముందుగా దాంట్లోని లింక్‌ను మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి ఆ లింక్‌పై క్లిక్ చేయొద్దు.. వివరాలు ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు.
