NTV Telugu Site icon

China: మిలియన్ డ్రోన్‌లను ఆర్డర్ ఇచ్చిన చైనా.. భారత్‌కి కొత్త ముప్పు..

China

China

China: సాంప్రదాయ యుద్ధం నుంచి నెమ్మదిగా ప్రపంచ దేశాలు హై టెక్నాలజీ వైపు దృష్టిసారిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, మిడిల్ ఈస్ట్ సంక్షోభాల్లో డ్రోన్‌ల వినియోగం విస్తృతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే చైనా తన డ్రోన్‌ల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది. చైనీస్ మిలిటరీ వర్గాల ప్రకారం.. ఒక మిలియన్ డోన్‌లను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. 2026 నాటికి వీటి డెలివరీ పూర్తి కానుంది.

Read Also: IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు వర్ష సూచన..! పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?

చైనా పెద్ద ఎత్తున డ్రోన్లను తమ సైన్యంలోకి తీసుకోవడం భారత్‌కి ముప్పుగా మారింది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ద్వారా AI-ప్రారంభించబడిన తేలికపాటి కమికేజ్ డ్రోన్‌ల విస్తరణ భారతదేశానికి గణనీయమైన సవాల్‌గా మారింది. , AI- ఎనేబుల్డ్ డ్రోన్ టెక్నాలజీతో భవిష్యత్తులో యుద్ధంలో ఆధిపత్యం చేసేందుకు దోహనం చేస్తుంది. దీనికి తోడు చైనా మిత్రుడు పాకిస్తాన్‌ కూడా ఈ డ్రోన్లను పొందే అవకాశాన్ని కొట్టిపారేయలేదు.

ఏఐ కామికేజ్ డ్రోన్లు 8 గంటల పాటు ఆకాశంలో ఉండగలవు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ నుంచి ఇవి తప్పించుకోగలవు. ఒక్కసారి లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఖచ్చితమైన సమాచారం కమాండ్ సెంటర్ల ద్వారా అందిస్తే , సమూహ దాడుల ద్వారా అధునాతన వాయు రక్షణ వ్యవస్థలను అధిగమించడానికి రూపొందించబడ్డాయి. భారతదేశం ఇప్పటికే LAC వద్ధ లేజర్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్‌డిక్షన్ సిస్టమ్స్ (IDD&IS) వెంట ఆధునిక డ్రోన్‌లను మోహరించింది.

Show comments