Site icon NTV Telugu

చైనా అక్రమ ఆక్రమణను భారత్ అంగీకరించదు: అరిందమ్ బాగ్చి

భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని చైనా అన్యాయ మైన వాదనలను భారత్ అంగీకరించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చిగురువారం తెలిపారు. “దశాబ్దాలుగా చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలతో సహా సరిహద్దు ప్రాంతాల్లో చైనా గత కొన్నేళ్లుగా నిర్మాణా కార్యకలాపాలను చేపట్టిందన్నారు. చైనాను దౌత్యపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు. స్థానిక జనాభా కోసం రోడ్లు, వంతెనల నిర్మాణంతో సహా సరిహద్దు మౌలిక సదుపాయాలను కూడా భారత ప్రభుత్వం పెంచిందని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

“అరుణాచల్ ప్రదేశ్‌తో సహా జీవనోపాధిని మెరుగుపరచడానికి సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను సృష్టించే లక్ష్యంతో భారత్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని అరిందమ్‌ బాగ్చివెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందని పెంటగాన్ నివేదిక పేర్కొన్న తర్వాత ఆయన ఈ ప్రకటన చేశాడు. గతేడాది నిర్మించిన ఈ కొత్త గ్రామం సారి నది వెంబడి వివాదాస్పద ప్రాంతంలో ఉందని పెంటగాన్‌ నివేదిక పేర్కొంది. 2020లో, LAC తూర్పు సెక్టార్‌లో టిబెట్ అటానమస్ రీజి యన్,భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మధ్య వివాదాస్పద భూభాగంలో 100- పౌర ఇళ్లు గల గ్రామాన్ని నిర్మిం చిందని పెంట గాన్‌ తెలిపింది.

Exit mobile version