Site icon NTV Telugu

Condom Remark: కండోమ్ వ్యాఖ్యలతో చిక్కుల్లో ఐఏఎస్‌.. వివరణ కోరిన బాలల హక్కుల సంఘం

Condom Remark

Condom Remark

Condom Remark: ఫ్రీగా వస్తే కండోములు కూడా కావాలంటారు అంటూ.. శానిటరీ ప్యాడ్‌లపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మహిళా ఐఏఎస్‌ అధికారి హర్‍జోత్‌ కౌర్‌ చేసిన కామెంట్లు ఆమెను చిక్కుల్లో పడేశాయి. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. సెప్టెంబర్‌ 27న జరిగిన కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఏఎస్‌ అధికారిని హర్‌జోత్‌ కౌర్‌ భమ్రా వివరణ ఇవ్వాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. పాఠశాల బాలికలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటంపై దూమారం చెలరేగటంతో ఇప్పటికే వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఐఏఎస్‌ అధికారిని హర్‌జోత్‌ కౌర్‌పై చర్యలు తీసుకుంటామని బిహార్ సీఎం నితీష్ కుమార్‌ సూత్రప్రాయంగా తెలిపినట్లు సమాచారం.

Drishyam Real Incident: దృశ్యం సినిమా స్ఫూర్తితో.. ప్రియుడితో కలిసి తండ్రిని చంపింది

ఇంతకీ.. ఆమె ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయానికి వస్తే.. బీహార్‌లోని పాట్నాలో విద్యార్థులతో ‘శశక్త్ బేటీ.. సమృద్ధ్ బీహార్’ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు బీహార్ ఉమెన్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్‌జోత్ కౌర్… అయితే, ఓ విద్యార్థిని నుంచి ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.. విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, సైకిళ్లు వంటివి ఇస్తోంది.. వారి కోసం ఇంత చేస్తున్న సర్కార్‌.. రూ. 20-30 విలువ చేసే శానిటరీ నాప్‌కిన్స్‌ను ఫ్రీగా ఇవ్వలేదా? అని ప్రశ్నించింది.. ఇక, విద్యార్థిని ప్రశ్నపై తీవ్రంగా స్పందించారు హర్‌జోత్ కౌర్.. కోరికలకు అంతు ఉండక్కర్లేదా? అని వార్నింగ్‌ ఇస్తూనే.. ఈ రోజు నాప్‌‌కిన్స్ అడుగుతున్నారని ఇస్తే.. చివరికి కుటుంబ నియంత్రణ కోసం కండోములను కూడా ఉచితంగా ఇమ్మంటారంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఐఏఎస్‌ అధికారిని.. ఇలా నోరు జారడం.. విద్యార్థులకు సరైన రీతిలో సమాధానాలు చెప్పాల్సింది పోయి.. ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. హర్‌జోత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఆమె కామెంట్లకు కౌంటర్‌ ఇస్తున్నారు నెటిజన్లు..

Exit mobile version