Site icon NTV Telugu

Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రికి తప్పిన విమానం ప్రమాదం.. పైలట్ ఏం చేశాడంటే..!

Rajasthan Chief Minister

Rajasthan Chief Minister

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు విమాన ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం గత వారం దారి తప్పినట్లుగా వార్తా నివేదికలు అందుతున్నాయి. జూలై 31న చార్టర్డ్ విమానం ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లోని ఫలోడికి బయల్దేరింది. విమానం ఫలోడి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది.. కానీ నగరంలోని సివిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అయింది. వెంటనే తప్పును గ్రహించిన పైలట్లు.. తిరిగి ఫలోడి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌‌కు తీసుకొచ్చారు. ఈ కారణంగా ముఖ్యమంత్రికి రెండు గంటలు ఆలస్యం అయింది. ఈ కేసుపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది. ఇక దర్యాప్తులో భాగంగా పైలట్లను ఫ్లయింగ్ డ్యూటీ నుంచి తొలగించింది.

ఇది కూడా చదవండి: UP Floods: యూపీని ముంచెత్తిన భారీ వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం

జూలై 31న మధ్యాహ్నం 3 గంటలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను ఫాల్కన్ 2000 విమానం ఢిల్లీ నుంచి ఫలోడికి బయల్దేరింది. అయితే విమనం పొరపాటున వైమానిక దళ స్టేషన్‌లో ల్యాండ్ అయింది. లోపాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే గమ్యస్థానానికి తరలించారు. దాదాపు ల్యాండ్ అయిన దగ్గర నుంచి తిరిగి గమ్యస్థానానికి 5 కి.మీ దూరం ఉన్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి రెండు గంటల ఆలస్యంగా జైపూర్‌కు వెళ్లారు. ఇక చార్టర్ విమానం అదే రాత్రి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయింది. అయితే పైలట్లు రన్‌వేనే తప్పుగా గుర్తించడం వల్లే ఈ పొరపాటు జరిగినట్లుగా దర్యాప్తు సంస్థ గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

Exit mobile version