Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..

  • 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు ఎంఎంకే డిమాండ్..
  • ఖైదీల్లో కోయంబత్తూర్ పేలుళ్ల ఖైదీలు కూడా..
  • తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ నిరసన ప్రదర్శన..
Mmk

Mmk

Chennai Protest:  జీవిత ఖైదు అనుభవిస్తున్న 22 మంది ముస్లిం ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు రాజధాని చెన్నైలో మనితనేయ మక్కల్ కట్చి(MMK) భారీ నిరసన ర్యాలీని నిర్వహించింది. దీంతో పాటు ముస్లిం మతంలోకి వెనుకబడిన తరగతుల (BC), అత్యంత వెనుకబడిన తరగతుల (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలకు చెందిన వారికి గతంలో అమలైన 3.5 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ ర్యాలీలో 10,000 మంది పాల్గొన్నారు.

విడుదల చేయాలని కోరుతున్న ఖైదీల్లో 1998 కోయంబత్తూర్ వరస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు పడిన 14 మంది కూడా ఉన్నారు. బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ టార్గెట్‌గా ఈ దాడికి పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో శిక్ష పడినవారు గత 28 ఏళ్లుగా జైలులోనే ఉన్నారు. ఉగ్రవాద దాడికి పాల్పడిన నేరస్తుల్ని విడుదల చేయాలనే డిమాండ్‌పై విమర్శలు వస్తున్న వేళ.. MMK అధినేత డాక్టర్ ఎం.హెచ్. జవాహిరుల్లా మాట్లాడుతూ.. ఆ ఖైదీల జీవితం మొత్తం జైలులోనే గడిచిందని, గతంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, ఒక కమిషన్ సిఫారసు మేరకు ఇతర మతాలకు చెందిన వారితో పాటు ఇలాంటి కేసుల్లో ఉన్న 41 మందిని విడుదల చేసినట్లు చెప్పుకొచ్చారు.

MMK ప్రస్తుతం డీఎంకేకు మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సహా గతంలో డీఎంకే కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు టీవీకే వైపు వెళ్లినప్పటికీ, MMK మాత్రం డీఎంకేతోనే కొనసాగుతోంది. తమ డిమాండ్లపై విజయ్ సర్కార్‌ చర్యలు తీసుకోవాని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.