Chennai: కొన్ని సంస్థలు ఉద్యోగుల కష్టాలను గుర్తిస్తాయి. మరికొన్ని సంస్థలు మాత్రం జీతాలు తీసుకునే యంత్రాల్లాగే ఉద్యోగులు ట్రీట్ చేస్తుంటాయి. ఇలా ఉద్యోగుల పనితనాన్ని గుర్తించే సంస్థలు తమ ఉద్యోగుల కోసం గిఫ్ట్‌లు ఇచ్చిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా చెన్నైకి చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల కృషిని గుర్తించి వారికి కార్లు, బైకులు అందించింది.
Read Also: Ambedkar remark: “అంబేద్కర్ వ్యాఖ్యల”పై అమిత్ షాకి వ్యతిరేకంగా డీఎంకే తీర్మానం..
బహుమతుత్లో టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఉన్నాయి. 20 మంది ఉద్యోగులకు వీటిని అందించారు. తమ గోల్స్ రీచ్ కావడానికి, ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి వీటిని అందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది. సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాజిస్టిక్ సెక్టార్‌లో వినియోగదారులు ఎదుర్కొనే ప్రొడక్ట్స్ డిలే, పారదర్శకత లేకపోవడం, అసమర్థమైన సప్లై చైన్ వంటి సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఇలా బహుమతులు అందించడం ఉద్యోగులు సంక్షేమం, ఉద్యోగుల సంతృప్తి మెరుగుపరచడంతో పాటు ఉత్పాదకతను కూడా మెరుగుపడచం వంటి వాటిని ప్రోత్సహిస్తుందని కంపెనీ అధికారులు చెబుతున్నారు.