పంజాబ్‌కు నూతన సీఎంగా ఎంపికైన చరణ్‌జిత్ సింగ్ చన్నీ కొత్త రికార్డ్ సృష్టించనున్నారు. పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర లిఖించనున్నారు. ఇప్పటి వరకు పంజాబ్‌కు 15 మంది ముఖ్యమంత్రులు పని చేశారు. పంజాబ్‌కు 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చన్నీ.. రాష్ట్రానికి మొదటి దళిత సీఎం కానున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కేబినెట్‌లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఛంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పంజాబ్ సీఎంగా రికార్డు సృష్టించనున్న చరణ్‌జిత్ సింగ్
