Char Dham : చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలకు డీజీసీఏ ఆమోదం
- చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలకు డీజీసీఏ ఆమోదం
- చార్ థామ్ జరిగిన ప్రమాదాలతో గతంలో నిలిచిపోయిన హెలికాప్టర్ సేవలు
- పూర్తి నిబంధనలతో హెలికాప్టర్ సేవలను ప్రారంభించాలని ఆదేశించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను పునఃప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదం తెలిపింది. మాన్సూన్ విరామం అనంతరం ఈ సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. యాత్రలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కేంద్రం హెచ్చరించింది. ఇందుకోసం డీజీసీఏ, ఏఎయ్ఐ, రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ (UCADA) మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read
సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు డీజీసీఏ బృందం హెలిపాడ్లు, హెలికాప్టర్లు, ఆపరేటర్లపై సమగ్ర తనిఖీలు జరిపింది. అనంతరం భద్రతా ప్రమాణాలు పాటించాలనే నిబంధనలతో అనుమతులు మంజూరు చేసింది.
పైలట్లకు ప్రత్యేకంగా హై–ఆల్టిట్యూడ్ ఆపరేషన్ శిక్షణ ఇవ్వబడింది. భద్రతా సూచనలపై అన్ని హెలికాప్టర్ ఆపరేటర్లు, పైలట్లకు డీజీసీఏ ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించింది.
డెహ్రాడూన్ (సహస్త్రధారా) నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రీనాథ్ ఆలయాలకు చార్టర్ సర్వీసులు నడుస్తాయి. గుప్తకాశి–ఫాటా–సితాపూర్ క్లస్టర్ నుంచి కేదార్‌కు shuttle సేవలు అందించనున్నారు. మొత్తం ఆరుగురు ఆపరేటర్లు shuttle సేవలు, ఏడుగురు ఆపరేటర్లు చార్టర్ సర్వీసులు నిర్వహించనున్నారు.
డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం పైలట్లకు రూట్ చెక్స్, పునరావృత శిక్షణ తప్పనిసరి. బరువు, సంతులనం పరిమితులు కఠినంగా అమలు చేయాలి. అదనంగా హెలిపాడ్ల వద్ద గ్రౌండ్ సిబ్బంది పెంచి, ప్రయాణికులకు భద్రతా సూచనలు అందించనున్నారు.
వాతావరణంపై రియల్ టైమ్ అప్డేట్స్ అందించేందుకు ప్రత్యేక సిస్టమ్ అమలు చేస్తున్నారు. మే–జూన్ 2025లో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదాల తర్వాత ఈసారి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
“యాత్రలో భద్రతకే అత్యధిక ప్రాధాన్యం. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణ భద్రత విషయంలో రాజీ పడబోం అని డీజీసీఏ ప్రకటించింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
-
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!