Site icon NTV Telugu

Chandrayaan-3: నియంత్రణ కోల్పోయిన చంద్రయాన్-3.. భూ వాతావరణంలోకి రాకెట్ భాగం

Untitled 18

Untitled 18

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్-3 ప్రాజెక్టు ను ప్రతిష్ఠతంకంగా చేపట్టింది. ఎంతో నేర్పుగా చంద్రయాన్ 3 రాకెట్టు ప్రాజెక్టు పూర్తి చేసిన ఇస్రో.. ఈ ఏడాది జులై 14న విజయవంతంగా ప్రయోగించింది. అలానే ఇస్రో శాస్త్రవేత్తల కష్టానికి ప్రతిఫలంగా చంద్రయాన్-3 చంద్రుని దక్షణ ధ్రువం పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసి యావత్ ప్రపంచం భరత్ వైపు చూసేలా చేసింది. ఎవరు సాధించని ఘనతను సాధించి చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ చంద్రయాన్-3 పైన ఇస్రో తాజా ప్రకట చేసింది. చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన లాంచ్ వెహికల్ ఎల్‌వీఎం3 ఎం4 లోని క్రయోజనిక్ పైభాగం నియంత్రణ కోల్పోయి బుధవారం మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాలకు భూ వాతావరణంలోకి ప్రవేశించిందని.. అది ఉత్తర పసిఫిక్ మహాసముద్రం లో పడే అవకాశం ఉందని తెలిపింది.

Read also:Mallikarjun Kharge: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో..

అలానే దాని చివరి గ్రౌండ్ ట్రాక్ మాత్రం భారత్ మీదుగా వెళ్ల లేదని తెలిపింది. కాగా ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెర్బిస్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రకారం ఎల్వవీఎం3 ఎం4 క్రయోజనిక్ ఎగువ దశ జీవిత కాలం దాదాపు 25 సంవత్సరాలుగా ఇస్రో పేర్కొంది. అలానే ఐక్యరాజ్యసమితి, ఐఏడీసీ మార్గదర్శకాల అనుసారం చంద్రయాన్-3 ప్రొపల్షన్, ల్యాండింగ్ మాడ్యూళ్లు రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత దాని అవశేషాలు, ఇంధన వనరులు ప్రమాదవశాత్తు పేలుడుకు గురికాకుండా.. అలానే ఒక వేళ పేలుడు సంభవించిన ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఎగువ దశను నిష్క్రియాత్మకం చేశామని తెలిపింది. అంతర్జాతీయంగా ఆమోదించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఈ రాకెట్ బాడీని ష్క్రియాత్మకం చేయడం.. మిషన్ పూర్తయిన తర్వాత బాహ్య అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కాపాడటానికి భారత్ నిబద్ధతను ఇది మరోసారి పునరుద్ఘాటిస్తుంది అని ఇస్రో స్పష్టం చేసింది.

Exit mobile version