NTV Telugu Site icon

chandrayaan-3: చంద్రుడిపై భారీ అగ్నిపర్వతాలు ఉండేవా..? ప్రజ్ఞాన్ గుర్తించిన మూలకాలు ఏం చెబుతున్నాయి..?

Moon

Moon

chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండిగై చరిత్ర సృష్టించింది. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ తమ పనిని ప్రారంభించాయి. ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ అక్కడి నేలలోని మూలకాలను విశ్లేషిస్తోంది. ప్రజ్ఞాన్ రోవర్‌లోని ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోస్కోప్ (APXS) పరికరం చంద్రుని దక్షిణ ప్రాంతంలో సల్ఫర్, కొన్ని ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించిందని ఇస్రో గురువారం తెలిపింది. దీనికి ముందు, మంగళవారం, ఇస్రో మరొక పరికరం, లేజర్-ఇన్‌క్లూసుడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) చంద్రుడిపై సల్ఫర్‌ను కనుగొన్నట్లు ప్రకటించింది.

Read Also: NASA: చంద్రుడిపై కుప్పకూలిన లూనా-25.. కూలిన ప్రదేశం గుర్తింపు.. ఫోటోలు ఇవే.

చంద్రయాన్ -3 మిషన్ ద్వారా సల్ఫర్‌ని గుర్తించడం కీలక విజయంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతోపాటు కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్‌తో పాటు ఎంతో కీలకమైన ఆక్సీజన్ ఆనవాళ్లను గుర్తించినట్లు ఇస్రో తెలింది. చంద్రుడిపై గుర్తించిన సమ్మేళనాలు విశ్వచరిత్రకు సంబంధించిన అన్వేషణలకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. చంద్రుడి నిర్మాణం గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సల్ఫర్ చంద్రుడిపై ఉన్న వాటార్ ఐస్‌లో చిక్కుకుపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సల్ఫర్ ఆనవాళ్లు గుర్తించడం అంటే ఒకానొక కాలంలో చంద్రుడి ఉపరితలంపై భారీ అగ్నిపర్వత కార్యకలాపాలు ఉండవచ్చని, భారీ అగ్నిపర్వతాలు ఉండే అవకాశం ఉందని సూచిస్తోంది. అయితే దీనికి మరింత డేటా అవసరం అని డిపార్ట్మెంట్ ఆఫ్ షైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త వీటీ వెంకటేశ్వరన్ అన్నారు. సల్పర్ ఉనికితో చంద్రుడి భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో పురోగతి సాధించే అవకాశం ఏర్పడింది. భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిని లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకునేందుకు హీలియం, నీరు, హైడ్రోజన్ వంటి వాటిని చంద్రుడి ఉపరితలంపై గుర్తించడం చాలా ముఖ్యమని అన్ని దేశాల శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Show comments