Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Chandigarh Caps Sale Of Fuel Amid Panic Buying Over Truckers Strike

Truckers Strike: ప్రజల్లో “పెట్రోల్” భయాలు.. అమ్మకాలపై పరిమితి..

Published Date :January 2, 2024 , 8:47 pm
By Venu Goapl Reddy
Truckers Strike: ప్రజల్లో “పెట్రోల్” భయాలు.. అమ్మకాలపై పరిమితి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Truckers Strike: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ‘హిట్ అండ్ రన్’ చట్టంపై ట్రక్కులు, బస్సు, లారీలు, ట్యాంకర్ల డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కేసుల్లో ఎక్కువ కాలం శిక్షతో పాటు జరిమానా భారీగా ఉండటాన్ని వారు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తు్న్నారు. పలు నగరాల్లో రోడ్లపై ఆందోళనలు చేశారు. అయితే డ్రైవర్ల సమ్మె వల్ల సామాన్య ప్రజానీకంలో భయాలు మొదలయ్యాయి. ఆందోళన నేపథ్యంలో ట్యాంకర్ల డ్రైవర్లు కూడా విధులకు రాకపోవడంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందని భయపడుతున్నారు.

Read Also: Hit-and-Run law: కొత్త “హిట్ అండ్ రన్” చట్టంలో ఏముంది..? డ్రైవర్ల ఆందోళన ఎందుకు..? పాతచట్టం ఏం చెబుతుంది..?

ఈ భయాల నేపథ్యంలో దేశంలో అన్ని చోట్ల వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి చూసి ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పెట్రోల్, డిజిల్‌కి అనూహ్యమైన డిమాండ్ ఏర్పడటంతో స్థానిక అధికారులు పరిమితి విధిస్తున్నారు. చండీగఢ్‌లో ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా 2 లీటర్లు లేదా రూ. 200 వరకు పరిమితి విధించారు. ఇక కార్ల వంటి ఫోర్ వీల్ వాహనాలకు 5 లీటర్లు లేదా గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే ఇంధనాన్ని పోస్తున్నారు.

ఇంధన సరఫరాలో తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినందున ఇంధనం అందరికి లభించేందుకు పరిమితి విధించినట్లు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ప్రతీ బంకు నిర్వాహకులు ఈ నిబంధనలను పాటించాలని కోరారు. విధించిన ఆంక్షలకు వినియోగదారులు సహకరించాలని ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరియు పంజాబ్ మరియు హర్యానాల సమన్వయంతో చండీగఢ్‌కు ఇంధన సరఫరాను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hit and run cases
  • hit-and-run Act
  • Truckers Protest
  • Truckers Strike

తాజావార్తలు

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions