NTV Telugu Site icon

Cervical Cancer Vaccine: గుడ్ న్యూస్.. 4 నెలల్లో అందుబాటులోకి గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్

Hpv Vaccine

Hpv Vaccine

Cervical Cancer Vaccine Could Be Developed In India by April-May 2023: మహిళ మరణాలకు కారణం అవుతున్న కాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్( గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ఒకటి. దీన్ని అరికట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది భారత్. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పారు కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైసరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు కారణం అవుతున్న హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) నివారణకు సెర్వవాక్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని డాక్టర్ అరోరా వెల్లడించారు.

Read Also: Nitish Kumar: తేజస్వీ యాదవ్‌కు అధికారం.. నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

అంతర్జాతీయ వ్యాక్సిన్ల ధరలో కేవలం పదోవంతు ధరతోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే భారతదేశంలో రెండు మూడు కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉన్నాయని.. అయితే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వ్యాక్సిన్ అనుమతులను పొందిందని అన్నారు. 2023 ఏప్రిల్-మే నెలల్లో భారతీయుల కోసం అందుబాటులోకి వస్తుందని అన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న కొన్ని దేశాల సరసన భారత్ నిలువనుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది దాదాపుగా 80,000 గర్భాశయ క్యాన్సర్ కేసులు వస్తున్నాయని డాక్టర్ అరోరా తెలిపారు. ప్రపంచంలోనే గర్భాశయ క్యాన్సర్ వల్ల భారతదేశంలోనే ఎక్కువ మంది మరణిస్తున్నారని అన్నారు. గడిచిన 24 గంట్లలో గర్భాశక క్యాన్సర్ వల్ల మనదేశం 95-100 మంది మహిళలను కోల్పోయిందని అన్నారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఈ క్యాన్సర్లకు కారణం అవుతుందని అన్నారు. 9-14 మధ్య ఉన్న బాలికలకు జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.